calender_icon.png 23 July, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల సంక్షేమమే తపస్ లక్ష్యం

22-07-2025 07:05:53 PM

జిల్లా అధ్యక్షులు శ్రీమతి పర్వతం సంధ్యారాణి..

తుంగతుర్తి (విజయక్రాంతి): నిరంతరం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా తపస్ పనిచేస్తుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా(Suryapet District) అధ్యక్షులు పర్వతం సంధ్యారాణి అన్నారు. తుంగతుర్తి మండలంలోని జడ్పీహెచ్ఎస్ వెలుగు పల్లి, సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్ వెలుగుపల్లి ఎంపీపీఎస్ తుంగతుర్తి, జడ్పీహెచ్ఎస్ తుంగతుర్తి గర్ల్స్, జెడ్ పి హెచ్ ఎస్ తుంగతుర్తి బాయ్స్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తుంగతుర్తి జడ్పీహెచ్ఎస్ తూర్పు గూడెం, ఎంపీపీఎస్ గానుగ బండ, ఎంపీపీఎస్ తూర్పు గూడెం, జడ్పిహెచ్ఎస్ కరివిరాల, ఎంపీపీఎస్ కరివిరాల, కేజీబీవీ తుంగతుర్తి, జడ్పీహెచ్ఎస్ రావులపల్లి, ఎంపీపీఎస్ రావులపల్లి తదితర పాఠశాలలు పర్యటన చేసి ఉపాధ్యాయులకు సభ్యత్వాలు అందించారు.

ఉపాధ్యాయులు భారీ స్థాయిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. జిహెచ్ఎం పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలన్నారు. తపస్ సభ్యత్వ నమోదు అభియాన్ లో జిల్లా బాధ్యులు గుండు ఆంజనేయులు, మండల అధ్యక్షులు గుర్రం పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పిన్నపురెడ్డి కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.