8 April, 2026 | 5:04 PM

టచ్ రగ్బీ నేషనల్ మీట్లో పాల్గొననున్న కస్తూర్బా విద్యార్థి

08-04-2026 03:09 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని కస్తూర్బా పాఠశాల చెందిన ఇద్దరు విద్యార్థులు టచ్ రగ్బీ  గేమ్లో రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయినట్లు పాఠశాల ప్రిన్సిపల్ గీత తెలిపారు. ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ గీతా మాట్లాడుతూ... స్టేట్ మీట్ హైదరాబాదులోని సరూర్ నగర్లో ఫిబ్రవరి 27వ తేదీన జరిగినటు వంటి స్టేట్ మీట్ టచ్ రగ్బీ గేమ్లో కస్తూర్బా పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి స్రవంతి, ఏడవ తరగతి విద్యార్థి యుక్తేశ్వరి ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. అలాగే స్టేట్ స్థాయి నుండి నేషనల్ కూడా ఇద్దరిలో నుండి ఒక విద్యార్థిని యుక్తేశ్వరి సెలెక్ట్ కావడం జరిగిందన్నారు. ఏప్రిల్ 10, 11 తేదీలలో జమ్ము కాశ్మీర్లోని శ్రీనగర్లో జరిగే టచ్ రగ్బీ నేషనల్ మీట్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా యుక్తేశ్వరుని పాఠశాల ప్రిన్సిపాల్ గీత,పిటి శోభ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.