calender_icon.png 6 December, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ అభ్యర్థి దండ్ల అనురాధకు ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాసుల, భాస్కర్ రెడ్డి

06-12-2025 05:48:26 PM

బాన్సువాడ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, SN పురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దండ్ల అనురాధ బాలరాజుకు మద్దతుగా శనివారం రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డిలు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 13వ వార్డు, 14వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించి గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మీ విలువైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి దండ్ల అనురాధ బాలరాజును అత్యధిక మెజారిటీతో సర్పంచ్ గా వారి ఛానల్ వాడు మెంబర్లను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలకు కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.