06-12-2025 05:45:57 PM
భైంసా (విజయక్రాంతి): జీపీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పక్కాగా నిర్వహించాలని జిల్లా ప్రత్యేక పరిశీలకురాలు ఆయేషా ముష్రత్ అధికారులను ఆదేశించారు. శనివారం బైంసా మండలంలోని దేగాం నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి అధికార సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటిస్తూ ఎన్నికల గుర్తులు కేటాయించాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధికారులు పాల్గొన్నారు.