6 July, 2026 | 4:17 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

కట్ట ప్రణతికి జేఎన్టీయూ బంగారు పతకం..

09-06-2025 07:13 PM

రైతు బిడ్డ కష్టానికి ప్రతిఫలం..

కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెనగడప గ్రామానికి చెందిన కట్ట సత్యనారాయణ-రజని దంపతుల రెండవ కుమార్తె కట్టా ప్రణతి జేఎన్టీయూ మంథని(JNTUH College of Engineering Manthani)లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఈ క్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రణతికి ఇటీవల హైదరాబాద్ జేఎన్టీయూలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Verma) బంగారు పథకాన్ని అందించి సత్కరించారు.

ఈ సందర్భంగా ప్రణతి మాట్లాడుతూ... భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడమే తన లక్ష్యమని, అమ్మానాన్న పడ్డ కష్టాన్ని జీవిత కాలం గుర్తుపెట్టుకుంటూ, వారు చూపిన బాటలో నడుచుకుంటూ కుటుంబానికి దేశానికి మంచి పేరు తేవడానికి ప్రయత్నం చేస్తానన్నారు. బంగారు పతకం సాధించిన తర్వాత,నాపై బాధ్యత మరింతగా పెరిగిందని, భవిష్యత్తులో నా లక్ష్యం గ్రూప్స్ వైపు,యూపీఎస్సీ వైపు గురి పెట్టి ఉన్నత లక్ష్యాన్ని సాధించి మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తానన్నారు.