30 August, 2026 | 8:38 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ద్విభాషా చిత్రంలో భరత్

05-06-2025 12:00 AM

రఫ్ నోట్ ప్రొడక్షన్ పతాకంపై రాజ్‌తరుణ్ హీరోగా ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోంది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ‘ప్రేమిస్తే’ భరత్ కీలక పాత్రను పోషించనున్నాడు. కాదల్, పట్టియల్, కాళిదాస్ వంటి చిత్రాల్లో తన విభిన్న నటనతో పేరు తెచ్చుకున్న భరత్ ఈ సినిమాలో ఎమోషనల్ అండ్ ఎనర్జీ నిండిన పాత్రను పోషిస్తున్నాడు.

కథను ముందుకు నడిపించే కీలక పాత్రలో భరత్ కనిపించనుండగా.. ఈ పాత్ర అందర్ని అలరించేలా ఉంటుందని టీమ్ చెబుతోంది. ప్రేమిస్తే చిత్రంలో కథానాయకుడిగా తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న భరత్ భాగస్వామ్యంతో ఈ ద్విభాషా చిత్రానికి పాన్ సౌత్ ఇండియన్ రేంజ్ వచ్చినట్టయింది. భరత్ ఈ సినిమాలో భాగమవుతున్న విషయాన్ని వెల్లడించిన సందర్భంలో దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నటుడు ఆరి తన కెరీర్‌లో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.

రాజ్‌తరుణ్ తమిళంలోకి అడుగుపెడుతున్నారు. సంగీత దర్శకుడు పాల్ డబ్బా నటుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పుడు భరత్ భాగమవుతున్నారు. భరత్ ఎంతో నిబద్ధత గల నటుడు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర కథలో ఎంతో ప్రాధాన్యంతో కూడుకున్నది. కథను మలుపు తిప్పే ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కూడా ఎంతో తోడవుతుంది’ అన్నారు.