కౌశిక్ పట్టుదల అద్భుతం
25-05-2024 12:05 AM
హర్యానాకు చెందిన దివ్యాంగుడు టింకేశ్ కౌశిక్ (30) రెండు కాళ్లు, ఒక చెయ్యి లేకున్నా కృత్రిమ అవయవాలతో ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకోవడం ద్వారా అద్భుతమైన రికార్డును నెలకొల్ప డం అభినందనీయం. ఇలా దాదాపు 90 శాతం వైకల్యంతో ఇంత గొప్ప లక్ష్యాన్ని సాధించిన వ్యక్తి ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎవ రూ లేరు. కౌశిక్ ప్రదర్శించిన పట్టుదల సమస్త మానవాళికే అసాధారణ స్ఫూర్తినిస్తున్నది. అతను 9 ఏళ్ల వయసులో విద్యుత్ షాక్ వల్ల రెండుకాళ్లు, ఒక చెయ్యి కోల్పోయాడు. జీవితంలో నిరాశ చెందకుండా కృత్రిమ అవయవాలతో అత్యంత కఠినమైన శిక్షణ తీసుకొని అరుదైన ఘనతను సాధించగలిగాడు.
-వెంకటేశం, పెద్దపల్లి






