28 June, 2026 | 1:56 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

విషాదంగా మారుతున్న ఈత సరదా

25-05-2024 12:05 AM

పాఠశాలలు, విద్యాసంస్థలకు వేసవి సెలవులు రావడంతో కొందరికి ఈత సరదా విషాదకరంగా మారుతున్నది. చిన్నారులు, యువత ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్న ఘటనలు ఈ మధ్య చాలా వెలుగు చూస్తున్నాయి. అవి ఎంతో కలచి వేసేలా విషాదాంతమవుతున్నాయి. స్నేహితులతో కలిసి వెళ్లి, మిత్రులు సవాలు చేయడంతోనో, ఇతరుల ప్రోత్బలంతోనో కుంటలు, చెరువుల్లోకి దిగి మరణిస్తున్నారు. తల్లిదండ్రులు, సంరక్షకులు, పెద్దల పర్యవేక్షణ లేకపోవడం ఇందుకు ముఖ్య కారణంగా కనిపిస్తున్నది. ఆయా తటాకాలవద్ద ప్రభుత్వాలు తగిన రక్షణ ఏర్పాట్లు చేయడం ఎంతో అవసరం.

 -తలారి గణేష్, వెల్లంకి, యాదాద్రి జిల్లా