06-02-2026 11:58:05 AM
హైదరాబాద్: కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Jagruthi President Kalvakuntla Kavitha) అన్నారు. హైదరాబాద్ లో జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12న సభ నిర్వహిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ నెల 12న ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ కు ఒక పుస్తకమే ఉంటుందని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)ను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని కవిత తెలిపారు. కేసీఆర్ఆర్ ను రాజకీయంగా ఎదుర్కొలేక రేవంత్ రెడ్డి(Revanth Reddy) తిడుతున్నారని వివరించారు.
ఫోన్ ట్యాపింగ్ సీరియల్(Phone tapping serial) ఎప్పుడు పూర్తవుతోందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్న చేప ప్రణీత్ రావుపై చర్యలు తీసుకున్నారు. ప్రణీత్ రావు కు ఆదేశాలిచ్చిన పెద్దచేపలపై చర్చలు తీసుకోరా? అని ప్రశ్నించారు. పార్టీ ఏర్పాటు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. పార్టీ ఆవిర్భానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నామన్నారు. జీసీల అంశంలో బీఆర్ఎస్ ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించలేదన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేయాలో.. వద్దో.. జీసీలు ఆలోచించుకోవాలని తెలిపారు. నేను అసంబద్ధంగా మాట్లాడితే ప్రజలే ప్రశ్నిస్తారని కవిత వెల్లడించారు. ఎవరు సమాధానాలు దాటవేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.