15 April, 2026 | 3:31 AM

‘జాగృతి జనం బాట’ పోస్టర్ ఆవిష్కరించిన కవిత

15-10-2025 12:52 PM

  1. జాగృతి జనం బాట’ పోస్టర్ ఆవిష్కరించిన కవిత.
  2. దారులు వేరైనప్పుడు కేసీఆర్ ఫొటో వాడటం సరికాదని భావించా.
  3. సామాజిక చైతన్యం కోసమే నా యాత్ర.
  4. కేసీఆర్‌ ఫొటో లేకుండా యాత్ర చేస్తా.
  5. కేసీఆర్‌ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు.
  6. నా తొవ్వ నేను వెతుక్కుంటున్న అన్న కవిత.

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం నాడు 'జాగృతి జనంబాట' పోస్టర్ ను ఆవిష్కరించారు. పోస్టర్ పై తెలంగాణ తల్లి, జయశంకర్ చిత్రాలు ఉన్నాయి. దారులు వేరైనప్పుడు కేసీఆర్ ఫొటో వాడటం సరికాదని భావించానని కవిత పేర్కొన్నారు. సామాజిక చైతన్యం కోసమే నా యాత్ర(Kavitha Padayatra) అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుంటుందనే అనేక మంది ప్రాణత్యాగం చేశారని చెప్పారు. సామాజిక తెలంగాణ సాధన కోసమే అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని కవిత వెల్లడించారు. నాలుగు నెలల పాటు తమ యాత్ర ఉంటుందన్నారు. జనంబాట యాత్రలో అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు చాలా తెలివైనవాళ్లు.. వారికన్నీ తెలుసని కవిత స్పష్టం చేశారు. యువత, మహిళలను మరింత చైతన్యవంతులుగా చేస్తామని పేర్కొన్నారు.