15-10-2025 12:54:42 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో విద్యుత్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యుత్ వినియోగదారులు తెలుపుతున్నారు. విద్యుత్ బిల్లులు తీసే సమయంలో బ్రంట్ మీటర్ అని బిల్లు తీసి అదనంగా 1160 రూపాయల బిల్లు విధిస్తున్నారని విద్యుత్ వినియోగదారులు తెలుపుతున్నారు. ఇలా మండలంలో ఎంతోమంది విద్యుత్ వినియోగదారుల మీటర్లకు అదనంగా చార్జీలు చేసినట్లు విద్యుత్ వినియోగదారులు తెలుపుతున్నారు. సామాన్య ప్రజల నుండి అధిక కరెంటు చార్జీలు విధించడం పట్ల విద్యుత్ వినియోగదారులు మండిపడుతున్నారు. సమయానికి బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్లు తొలగిస్తారు కానీ విద్యుత్ అధికారులు అధిక చార్జీలు విధిస్తే బాధ్యులు ఎవరని విద్యుత్ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఇట్టి విషయమై సంబంధిత విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి విధించిన అధిక చార్జీలను తొలగించి బిల్లులు తగ్గించాలని విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు.