calender_icon.png 8 February, 2026 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఆర్పీ అభ్యర్థు లను గెలిపించండి

08-02-2026 12:55:22 AM

  1. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే నాయకులతోనే అభివృద్ధి
  2. జనగామ, భూపాలపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రచారం

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శనివారం జనగామ మునిసిపాలిటీ 5, 10, 13, 23వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ మునిసిపల్ అభ్యర్థి మహ్మద్ జలీల్ పాషాకు మద్దతుగా ప్రజల మధ్యకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. భూపాలపల్లిలో జిల్లా అధ్యక్షుడు కౌటాం రవీందర్ బలపరిచిన 29వ వార్డు మమిడి శ్రీకాంత్, 10వ వార్డు -కవిత కృష్ణ, 18వ వార్డు గాజె వేణు గోపాల్, 22వ వార్డు కౌటాం సౌమ్య, 28వ వార్డు ఇనుగాల ప్రణయ్‌రాజ్‌లకు మద్దతుగా మల్లన్న ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు అనేకసార్లు అవకాశం ఇచ్చారని, అయినప్పటికీ మునిసిపాలిటీల్లో ప్రజల మౌలిక సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని అన్నారు. ఈసారి ఒక్క అవకాశం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇస్తే, రాజకీయాలే కాదు అభివృద్ధి కూడా మారుతుందని, ప్రజల సమస్యలను నేరుగా పట్టించుకుని పరిష్కారం చేసే కౌన్సిలర్లను టీఆర్పీ అంది స్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ వార్డు అభివృద్ధి కోసం పనిచేసే నాయకులని మల్లన్న తెలిపారు. మునిసిపాలిటీలను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులదేనని, అందుకే ప్రజలు ఈసా రి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. జనగామ మునిసిపాలిటీలో పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కౌన్సిలర్ స్థాయి నుంచే గట్టి పోరాటం చేస్తామని అన్నారు.