calender_icon.png 17 February, 2026 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండేపల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 06:20:55 PM

– వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పుట్టినరోజు సందర్భంగా మండేపల్లి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పూర్మనీ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పూర్మనీ రాజశేఖర్ రెడ్డితో పాటు సర్పంచులు బాలసాని పర్శరాములు, నాయిని సాయికృష్ణ, చెన్నవేణి పర్శరాములు, సాగ దేవేందర్, సిలివేరి చిరంజీవి, ఆత్మకూరి అనిల్, వెన్నమనేని రమణారావు, గుగ్గిల్ల అంజయ్య, సిలివేరి నరసయ్య, ఆవునూరు వెంకటరాములు, తిరుపతి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.