15 June, 2026 | 10:16 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం

15-06-2026 09:03 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్చార్జిగా గైని శ్రీనివాస్ గౌడ్ ఇటీవల నియామకమయ్యారు. గైని శ్రీనివాస్ గౌడ్ అభిమానులు సోమవారం ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ మరింత ప్రతిష్ట వంతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా గైని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టిఆర్ఎస్ మండల, గ్రామ కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో గ్రామ, గ్రామానికి టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను చేపడతామన్నారు. తనకు సపోర్టుగా కార్యకర్తలు నాయకులు ముందుకు వచ్చి సన్మానించినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో టిఆర్ఎస్ అధినేత్రి కవితమ్మ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. కవితమ్మ నాయకత్వంలో కామారెడ్డి గడ్డపై టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.