10 April, 2026 | 7:09 PM

తంగళ్ళపల్లిలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ క్రికెట్ కప్ 2026 క్రీడా పోటీలు

10-04-2026 05:32 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ క్రికెట్ కప్ 2026 క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా క్రీడాకారుల్లో ఉత్సాహం నింపుతూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య, మాజీ ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, పడిగల రాజు, జక్కుల నాగరాజ్, వేణుగోపాల్ రావు, మోతే మహేష్, అనిల్ గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పూర్ణి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోటీలలో మండలంలోని పలు గ్రామాల నుండి వచ్చిన జట్లు ఉత్సాహంగా పాల్గొంటూ విజయం కోసం పోటీపడుతున్నాయి. కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.