29 June, 2026 | 11:09 AM

ముగిసిన కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్

29-05-2025 12:50 AM

వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ 

మునిపల్లి, మే 28 :  మండలంలోని పెద్ద గోపులారం గ్రామంలో గత నెల 23వ తేదీ నుంచి నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ క్రీడా  పోటీలు బుధవారం నాడు ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్, సౌత్ ఇండియా రాష్ట్ర నాయకుడు చంటి రాహుల్ కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

అనంతరం క్రీడాల్లో విన్నర్ గా బుదేరా జట్టు, రన్నర్ గా పెద్దగోపులారం టీంకు బహుమతులు అందజేశారు. క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శైలజ, బిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మనతోరి శశికుమార్, మర్పల్లి మాజీ జడ్పిటిసి మధు, మాజీ సర్పంచులు కీర్తికుమారి, రమేష్,  శంకర్, శ్రీను పటేల్, నాయకులు ఆనంద్, బాగన్న, కార్తీక్, విట్టల్, అంజి, మహేందర్, రాజు, శేఖర్, శివకుమార్, అప్సర్, హఫీస్ పాల్గొన్నారు.