13 July, 2026 | 3:30 PM

కేసీఆర్ కుటుంబం మౌనంగా ఉండాలె

30-08-2024 12:57 AM

పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ 

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): కేసీఆర్ కుటుంబం చేసిన తప్పులకు ప్రాయశ్చితంగా కొద్ది రోజు లు మౌనంగా ఉంటే మంచిదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం అధికారం కోల్పో యి, కవిత లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుపోవడంతో తీవ్రమైన ఆందోళన, మానసికంగా కృంగిపోయి ఉందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని భ్రమలు కంటూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్‌గాంధీ విగ్రహం తిసేస్తామని అహంకారంతో మాట్లాడటం మంచిది కాదన్నారు.