తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు...
తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 25 సంవత్సరాల అభివృద్ధి సాధించిన ఘనత విజన్ ఉన్న నాయకుడు కేసిఆర్(KCR) అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు(BRS state leaders Gujja Yugandhar Rao) అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు తుంగతుర్తి మండలం నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొని కేసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి, గెలుపొందడంతో నేడు ప్రజలు కష్టాలు చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ చూపిన ఘనత కేసీఆర్ అన్నారు. 9 సంవత్సరాల హయాంలో మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కాలేశ్వరం ప్రాజెక్టు ఉచిత కరెంటు పింఛన్లు ప్రతి గ్రామంలో స్మశాన వేటికలు నిర్మాణం చేపట్టి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం హౌరా అనిపించిన ఘనత కేసిఆర్ కి దక్కిందని కొనియాడారు. రానున్న సంస్థగా ఎన్నికల్లో ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడే పని చేసి అత్యధిక స్థానాల్లో గెలుపొందులకు కృషి చేయాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఈనెల 27న వరంగల్లో నిర్వహించు బహిరంగ సభకు స్వచ్ఛందంగా నాయకులు కార్యకర్తలు పాల్గొని బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్ శ్రీశైలం యాదవ్ దొంగరి శ్రీను దుర్గయ్య గౌడ్ చర్ల సత్యనారాయణ గౌడ్ గోపగాని శ్రీను, రమేష్ పూర్ణా నాయక్, విజ్జు నాయక్ శ్రీకాంత్, సతీష్ తిరుపతి రాజేష్ లతీఫ్ వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






