22 April, 2026 | 7:23 PM

Breaking News

ఐలేని రెడ్డి సంఘం అధ్యక్షునిగా మల్లారెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •  

దెయ్యాలకు నాయకుడు కేసీఆర్.. దేవుడు ఎలా అవుతాడు?

27-05-2025 01:01 AM

నాగర్‌కర్నూల్, మే 26 (విజయక్రాంతి): దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీ ఆర్ దేవుడు ఎలా అవుతా డని ఎమ్మెల్సీ కవితను డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క ప్రశ్నించారు.

కేసీఆర్ చుట్టూ ఉన్నది దెయ్యాలేనని కేసీఆర్ కుమార్తె కవితకు ఇప్పుడు తెలిసి వచ్చిందిగానీ.. ప్రజలు ఏనాడో గుర్తు ఎరి గారని అందుకే ప్రజా ప్రభుత్వమైనా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. దెయ్యాల చుట్టూరా ఉంటూ, వాటికి ప్రాతినిధ్యం వహి స్తున్న కేసీఆర్ దేవుడు ఎలా అవుతాడో కవిత సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు.

సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి విద్యుత్ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. రాష్ట్రంలోని ఇందిరమ్మ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ఈ దెయ్యాలను రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

మరో రెండు దశాబ్దాల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుండటంతో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. దీంతో తన వద్దకు ఎవరూ రావడం లేదని కేసీఆర్ పెట్టుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రె స్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి పథకం దేశానికి రోల్ మోడల్‌గా మిగులుతుందని, వందమంది కేసీఆర్‌లు అడ్డువచ్చినా రాష్ట్ర ప్రగతి ఆగదన్నారు.

10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ఉద్యోగులకు పదివేల కోట్ల బకాయి లు పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎనిమిది వేల కోట్ల ఉద్యోగుల బకాయిలు క్లియ ర్ చేశామని చెప్పారు. మిగిలిన వాటిని దశలవారీగా పూర్తి చేస్తామని ఉద్యోగులను ఒప్పించామని తెలిపారు.

రైతు సంక్షేమాన్ని చూడలేక ఫామ్‌హౌస్‌లో పడుకున్న కేసీఆర్ కన్నీరు పెడుతున్నారని విమర్శించారు. రైతు లు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇస్తున్నందుకా, సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నందుకా అని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. కేవలం దోచుకుని దాచుకోవడం కోసమే తన కుటుంబం రాష్ట్రాన్ని పాలించిందని ప్రస్తుతం ఆ కుటుంబంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయ న్నారు. ఇప్పుడిప్పుడే కేసీఆర్ కుమార్తె కవితకు బీఆర్‌ఎస్‌లో దెయ్యాలు ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఆ దయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడెలా అవుతాడో తానే చెప్పాలన్నారు.