15 June, 2026 | 6:14 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

తెలంగాణ సాధించిన కారణ జన్ముడు కేసీఆర్

18-02-2026 12:00 AM

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం

సికింద్రాబాద్ ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దినోత్సవ వేడుకలు ఓల్ బోయిన్‌పల్లి తాజా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 72వ జన్మ దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ధవరాం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేలా ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మహానేత కెసిఆర్. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రతి వర్గానికీ మేలు చేశాయి.

ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలు చేసి వేలాది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు. మహిళల సాధికారత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అని పేర్కొన్నారు. అలాగే కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బోయిన్ పల్లి డివిజన్లో తాజా మాజీ కార్పొరేటర్ ము ద్దం నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. పేదమహిళలకు సుమారుగా 1200 వందల మంది కి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.