చేసిన తప్పులకు కేసీఆర్‌కు శిక్ష తప్పదు
01-05-2024 01:08 AM
పీసీసీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్
హైదరాబాద్, ఏప్రిల్ 30(విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్‌కు గతంలో చేసిన తప్పులకు శిక్ష తప్పదని టీ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అన్నారు. అధికారం పోయిందనే బాధలో కాంగ్రెస్ గురించి ఏవేవో మాట్లాడుతున్నాడని విమర్శించారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందన్న విషయం కేసీఆర్ మర్చిపోవద్దని అన్నారు. కేసీఆర్ తన కుమార్తె కవితకు బెయిల్ రాలేదని, విరిగిన తొంటి ఎముక అతుక్కోలేదన్న బాధలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రా వ్యాపారులకు వందల ఎకరాల భూములు ధారదత్తం చేశారని ఆరోపించారు.




