11 April, 2026 | 5:25 PM

Breaking News

సీఎం రేవంత్‌కు నోటీసులు కక్ష సాధింపు చర్యే

01-05-2024 01:09 AM

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 30(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యలో భాగమేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే కాంగ్రెస్ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐతో బెదిరించాలని చూస్తోందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. ఫేక్ వీడియో అంటూ నోటీసులు పంపుతున్నారని, సీఎం రేవంత్‌రెడ్డికి ఆ వీడియోతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. నోటీసులకు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని, కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.