11 April, 2026 | 8:37 PM

ఎంజెపిలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

11-04-2026 06:50 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మండలంలోని బాబాపూర్ గ్రామ సమీపంలో గల ఎంజెపి బాలికల గురుకుల పాఠశాలలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రిన్సిపాల్ సుకన్య పూలే దంపతుల సేవలను విద్యార్థులకు వివరించారు. విద్య యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.