11 April, 2026 | 9:01 PM

మైనార్టీ గురుకుల అడ్మిషన్ మేళా

11-04-2026 06:43 PM

జైనూర్,(విజయక్రాంతి): జైనూర్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా మండల కేంద్రంలోని జామా మస్జీద్ వద్ద శనివారం ప్రత్యేక అడ్మిషన్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విశేష ఆసక్తి చూపారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సూఫీయా నాజ్ మాట్లాడుతూ... గురుకులంలో ఉచిత విద్యతో పాటు వసతి, పోషకాహారం, యూనిఫార్మ్‌లు, పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. అదనంగా డిజిటల్ క్లాసులు, సైన్స్ ల్యాబ్‌లు, క్రీడా సదుపాయాలు మరియు పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. అడ్మిషన్ అర్హతలు, దరఖాస్తు విధానం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు గురుకులంలో అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.