ప్రజలు దెబ్బకు బీజేపీ కొట్టుకుపోతుంది
మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్
హైదరాబాద్, ఏప్రిల్ 30(విజయక్రాంతి): ప్రజలు తిరగబడితే మోదీ, అమిత్‌షాతో పాటు బీజేపీ బంగాళాఖాతంలో కొట్టుకుపోతుందని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ మండిపడ్డారు. దేశంలో రిజర్వేషన్లు ఉండకూడదనేది ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతమని ఆయన ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వీపీ సింగ్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తే.. బీజేపీ కమండల్ యాత్ర చేస్తుందని మండిపడ్డారు. రిజర్వేషన్లపై బీజేపీ మాటలను బేస్ చేసుకునే సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడరని వివరించారు. ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని రాహుల్‌గాంధీ చెప్పారని, కుల గణన చేపట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారని గుర్తు చేశారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లను రాహుల్‌గాంధీ వ్యతిరేకించలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించమన్నారని ఆయన తెలిపారు.




