29 July, 2026 | 1:13 AM

కేసీఆర్ పాలన రావడం ఖాయం

29-07-2026 12:08 AM

ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్, జులై 28(విజయక్రాంతి): రేవంత్ రావణ పాలన పోవడం ఖా యం... కేసీఆర్ రాముడి పాలన రావడం ఖాయమని బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. హైడ్రా కమిషన ర్ రంగనాథ్ వ్యవహార తీరుపై రాష్ట్ర హైకోర్ట్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ మంగళవా రం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో హైడ్రా ద్వారా ప్రభుత్వం సాగించిన దురాక్రమ పాలన, హైడ్రా కమిషనర్  వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైడ్రా క మిషనర్ రంగనాథ్ ను తొలగించాలని హై కోర్టు ఇచ్చిన ఆదేశం పేద ప్రజల విజయం , అధర్మం పై ధర్మం సాధించిన విజయమని పేర్కొన్నారు. హై కోర్టు తీర్పు బిఆర్‌ఎస్ పేద ల పక్షాన సాగిస్తున్న పోరాటానికి వచ్చిన ప్ర తిఫలమని అన్నారు. రేవంత్ రెడ్డి హిట్లర్ పో కడలకు ఈ తీర్పు చెంప పెట్టని విమర్శించా రు. ఏ వ్యవస్థలైన బాబా సాహెబ్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పని చేయాల్సిం దే కానీ ఎనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం ప్రకారం కాదని హైడ్రా కమిషనర్ ను తొలగించాలని ఇచ్చిన తీర్పు రుజువు చేసింది.

రే వంత్ రెడ్డి మున్సిపల్ శాఖ కిందే హైడ్రా పని చేస్తోంది. హై కోర్టు తీర్పు తో రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖల మంత్రిగా కొనసాగే నైతిక అర్హతను కోల్పోయారని ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మా అధినేత కేసీఆర్ బిఆర్‌ఎస్ అధికారం లోకి వచ్చిన వెంటనే హైడ్రా భూతాన్ని తరిమికొడతామని ,మొదటి నిర్ణయం ఇదే అవుతుందని జగిత్యాల సభలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

రంగనాథ్ పోయి ఇంకో రంగయ్య వచ్చినా రేవంత్ హిట్లర్ పోకడలు మానక పోతే హైడ్రా తీరు మారదు.చేసిన దుర్మర్గాలు చాలవన్నట్టు హైడ్రా కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొమ్మిది తలల సర్పమని హై కోర్టు అంటే రేవంత్ రెడ్డి ని పది తలల రావణుడని ప్రజలు అంటున్నారు. తమకు నచ్చిన వారికి నజరానా నచ్చని వారికి జరిమానా అనే విధంగా హైడ్రా వ్యవహరించిందని అన్నారు. ఈ కార్యక్రమం లో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.