13 July, 2026 | 1:48 AM

పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం

13-07-2026 12:43 AM

ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

చౌటుప్పల్, జూలై 12: నిరుపేదల సొంతింటి కల నిజం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. చౌటుప్పల్ మండలం  ధర్మోజిగూడెం గ్రామంలో ఊదరి సుశీల - గోపాల్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా సర్పంచ్ జువ్వి నర్సింహ్మ హాజరై ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ జువ్వి న ర్సింహ్మ మాట్లాడుతూ నిరుపేదలకు సొంత ఇంటి కల, కలగా ఉండకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం ప్రవేశ పెట్టిందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్నారు.

ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకొని ఊదరి సుశీల - గోపాల్ దంపతులు గృహప్రవేశం చేయడం సం తోషంగా ఉందన్నారు. పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, నిరుపేదల పార్టీ కాంగ్రెస్ పా ర్టీ అన్నారు. గ్రామంలోని ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తానన్నారు. గృహప్రవేశం చేసిన అనంతరం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీహరి, మాజీ ఉపసర్పంచ్ కొంతం బుచ్చిరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు రాచకొండ వెంకటేశం, చెన్నోజు విజయ్ చారి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఊదరి నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.