8 August, 2026 | 1:14 AM

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి

08-08-2026 12:00 AM

జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా. ఏ. శ్రీనివాసులు 

మహబూబ్‌నగర్, ఆగస్టు 7 (విజయక్రాంతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్ ఎస్ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ‘ఫ్రై డే -డ్రై డే ‘సందర్భముగా దొడ్డోలోనిపల్లిలో నిర్వహిస్తున్న కార్యక్రమంను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఇంటి లోపల, ఇంటి పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకుంటే దోమల వలన వచ్చే వ్యాధులు రావు అని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామములో కలియ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి ప్రజలకు, ఆరోగ్య సిబ్బందికి సూచనలు చేశారు. నవజాత శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే సంపూర్ణ పోషకాహారమని అన్నారు.

శిశువు జన్మించిన తొలి గంటలోనే తల్లిపాలను ప్రారంభించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంపొందడంతో పాటు అనేక అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. పుట్టిన తొలి ఆరు నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలని, అనంతరం వయస్సుకు తగిన అదనపు ఆహారంతో పాటు రెండేళ్ల వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై  తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణలో తల్లిపాలు అత్యంత కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమం లోడా. నరేషచంద్ర, సుభాష్ చంద్ర, అశోక్ రాజు, చక్రపాణి, ఏ ఎన్ ఎమ్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.