కవిత బెయిల్ పిటిషన్ విచారణ నేటికి వాయిదా
న్యూఢిల్లీ, మే 27: లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ చేపట్టగా ఆమె తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ‘నా క్లుంట్‌పై తప్పుడు ఆరోపణలతో దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయించాయి. మహిళల హక్కులు కాలరాసే విధంగా ఆమెను కస్టడీలో ఉంచాయి. మహిళను అరెస్టు చేసే విషయంలో సీఆర్‌పీసీలోని అనేక అంశాలను లేవనెత్తుతూ మేము సుప్రీం కోర్టును ఆశ్రయించాం. కేసు విచారణలో ఉండగానే సీబీఐ, ఈడీ కవిత అరెస్ట్‌కు పూనుకొన్నాయి’ అని వాదించారు. దీనిపై ఈడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. మంగళవారం తగిన నివేదికలతో వాదిస్తామని కోర్టును గడువు కోరారు. అందుకు కోర్టు అనుమతించింది. కోర్టు ఇప్పటికే అనేక దఫాలుగా సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాదులు, కవిత తరఫు న్యాయవాది వాదనలను విన్నది.






