6 July, 2026 | 8:57 PM

Breaking News

సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •   అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ   •   జర్నలిస్టుల స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •   కొబ్బరితోట నరికివేత... పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా   •   ఇసుక వేలం.. రూ.2.76 లక్షల ఆదాయం..   •  

నుడా చైర్మన్‌గా కేశ వేణు

11-10-2024 12:40 AM

నిజామాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (నుడా) చైర్మన్‌గా కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణును నియమి స్తూ గురువారం పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. నియామకంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

అలాగే కేశ వేణుకు శుభాకాంక్షలు తెలిపారు. నగర పరిధిలో పార్టీ బలోపేతానికి వేణు చేసిన కృషికి ఫలితంగానే పదవి వరించిందని వారు తెలిపారు. వేణు యుక్త వయస్సులోనే కాంగ్రెస్‌లో చేరారు. నాటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (డీఎస్) అను చరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీకి విధేయుడుగా మెలుగుతూ పార్టీ యువజన వింగ్‌లో కీలక నేతగా ఎదిగారు. తర్వాత కార్పొరేటర్‌గా గెలిచారు. పార్టీ నగర అధ్యక్షుడిగా, కుర్మ సంఘం రాష్ట్ర నేతగా సేవలు అందించారు.