6 July, 2026 | 3:59 PM

Breaking News

సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •  

గీతన్నల క్షేమానికే కాటమయ్య కిట్లు

11-10-2024 12:39 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, అక్టోబరు 10: గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకే రాష్ట్రప్రభుత్వం కాటమయ్య కిట్లు పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో గురువారం ఆయన గీత కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ చేసి మాట్లాడారు.

ఈ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 100 అసెంబ్లీ నియోజకవర్గా ల్లో 10 వేల కిట్లు పంపిణీ చేశామన్నారు. కిట్లను గీతన్నలు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం తాను హుస్నాబాద్, ధర్మపురి, మానకొండూర్, మంథనిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో, అధికారులు పాల్గొన్నారు.