25 February, 2026 | 1:51 AM

కేజీబీవీ, మోడల్ టీచర్లకూ హెల్త్ కార్డులివ్వాలి

25-02-2026 12:00 AM
  1. మిగతా రాష్ట్రాల్లాగే టెట్ అర్హత మార్కులు తగ్గించాలి
  2. సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మంజూరు చేసినట్లుగానే కేజీబీవీ, గురుకుల, మోడల్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి కోరారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, సుంకరి బిక్షం గౌడ్‌లతో కలిసి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిను ఆయన నివాసంలో కలిశారు.

ఇతర రాష్ట్రాల మాదిరిగానే టెట్ అర్హత మార్కులను తగ్గించాలని సీఎంను ఆయన కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ ఆరోగ్య సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు ఈ సందర్భంగా సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ వెంటనే సంబంధిత అధికారులను ఆదేశిస్తూ రిపోర్ట్ తెప్పించి తగిన ఆదేశాలు ఇవ్వాలని సూచించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, దిలీప్ రెడ్డి పాల్గొన్నారు.