25 February, 2026 | 1:20 AM

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

25-02-2026 12:00 AM

మండల కేంద్రంలో పకడ్బందీగా పరీక్ష కేంద్రం

పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు

పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక ఆరోగ్య సేవలు

వెంకటాపూర్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీ డియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారం భం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వ హించబడుతున్న ఈ పరీక్షలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు కొనసాగనున్నా యి. రెండో ఏడాది పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబడనున్నాయి.

పకడ్బందీగా పరీక్ష కేంద్రం ఏర్పాట్లు

మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణను పకడ్బందీగా చేపట్టేందుకు కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పా ట్లు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎల్ చం దర్ తెలిపారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు తగిన సదుపాయాలు కల్పించినట్లు, పరీక్ష గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు, మాల్ ప్రాక్టీస్ను నివారించేందుకు ఫ్ల యింగ్ స్క్వాడ్ బృందాలు, ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. మొ దటి ఏడాది పరీక్షలకు 209 మంది విద్యార్థులు, రెండో ఏడాది పరీక్షలకు 152 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికె ట్ మరియు అవసరమైన పత్రాలతో సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని వారు సూచించారు. ఎటువంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందిని కూడా నియమిస్తున్నట్లు, మొత్తం గా పరీక్షలు ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అన్ని చర్యలు తీసుకున్నట్లు చందర్ తెలిపారు.

పరీక్ష కేంద్రంలో ప్రత్యేక ఆరోగ్య సేవలు

ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరోగ్య సేవలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంతంగా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పరీక్షలు రాయేందుకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించారు. ఈ పరీక్ష కేంద్రంలో ప్రాథమిక చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచారు. 

అనారోగ్యానికి గురైన విద్యార్థులకు వెంటనే వైద్య సహాయం అందించేందుకు ఆరోగ్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా సిద్ధం చేశారు. పరీక్షల సమ యంలో వేడి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సదుపాయం, గాలి చలామణి స దుపాయాలను మెరుగుపరిచారు. అవసరమైతే విద్యార్థులకు గ్లూకోజ్, ఓఆర్‌ఎస్ వంటి పదార్థాలు అందించే ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం ప్రధాన ప్రాధాన్యతగా తీసుకుని పరీక్షల కాలమంతా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని అధికారులు తెలిపారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.