కేజీబీవీలో పరీక్షల ఒత్తిడి–మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్‌లో విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడి మరియు మానసిక ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డా. ప్రవీణ్ కుమార్ విద్యార్థులతో మాట్లాడి, పరీక్షల భయం, ఆందోళనను ఎలా నియంత్రించుకోవాలి, సమయాన్ని సమర్థవంతంగా ఎలా వినియోగించాలి,ధ్యానం, విశ్రాంతి, సానుకూల ఆలోచనల ప్రాముఖ్యత వంటి అంశాలపై విలువైన సలహాలు, సూచనలు చేశారు.అలాగే ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సరైన నిద్ర, సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన అధ్యయన విధానం ఎంత ముఖ్యమో వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా. వేణుమాధవ్, ప్రిన్సిపల్ ఇంద్ర తో పాటు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు.




