calender_icon.png 11 August, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖబడ్దార్ చలమల్ల కృష్ణారెడ్డి

11-08-2025 12:17:40 PM

  1. రాజగోపాల్ రెడ్డిని విమర్శించే అర్హత లేదు..
  2. అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి..

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy) పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని అతనిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని చలమల్ల కృష్ణారెడ్డిని మండల కాంగ్రెస్ నాయకులు(Mandal Congress leaders) హెచ్చరించారు. సోమవారం నారాయణపురం మండల కేంద్రంలో మండల కమిటీ ఆద్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం చలమల్ల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలను చేశారని వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని లేనియెడల నియోజకవర్గంలో తిరగలేరని హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే ముందు అతని వ్యక్తిత్వం తెలుసుకోవాలని హితవు పలికారు.

సొంత నిధులతో నియోజకవర్గాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తూ ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా విద్యాలయాలు, ఆసుపత్రులలో మౌలిక వసతులను కల్పిస్తూ పేద విద్యార్థులకు  ఆర్థిక సాయం అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తున్న వ్యక్తి అని అన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఊర్లో  ప్రజల దాహాన్ని తీర్చడానికి బోర్లు వేసి సమస్యను పరిష్కరించారని గుర్తు చేశారు. పల్లెల్లో మార్నింగ్ వాక్ చేస్తూ గ్రామంలో వివిధ సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తూ ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చిన తర్వాతే మునుగోడు అభివృద్ధి చెందిందని చలమల్ల కృష్ణారెడ్డి( Chalamalla Krishna Reddy) కక్షపూరితంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మునుగోడు ప్రజలకు న్యాయం చేయాలని కెసిఆర్ పై యుద్ధం చేయడం కోసమే బిజెపిలోకి వెళ్లారని కాంగ్రెస్ నాయకులు తిరిగి బతిమిలాడితే కాంగ్రెస్ లోకి వచ్చారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల అప్పుడు మాత్రమే పరిచయమైన కృష్ణారెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని అన్నారు.చలమల్ల కృష్ణారెడ్డి వార్డు మెంబర్,సర్పంచ్ పోటీ చేసి గెలవాలని సూచించారు.