హైదరాబాద్: కాగ్ త్రైమాసిక నివేదిక(CAG Report) ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గడం.. ప్రమాద ఘంటికలను మోగిస్తోందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఆర్థిక రంగం దెబ్బతింటోందని ఆయన హెచ్చరించారు. విఫలమైన కాంగ్రెస్ పార్టీ పాలన విఫలమైన ఆర్థిక వ్యవస్థకు దారితీసింది. ఆదాయం తగ్గుముఖం పడుతోంది, అప్పులు పెరుగుతున్నాయి. ఇది రాకెట్ సైన్స్ కాదు. ఇది సాధారణ గణితం. కాంగ్రెస్ అసమర్థత భారంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోందని కేటీఆర్ హెచ్చరించారు.
ఆరు గ్యారంటీల(Congress Six Guarantees) కాంగ్రెస్ హామీ.. ఆర్థిక రంగానికి నష్టం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం తగ్గుతుంటే.. అప్పులు మాత్రం పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2,738 కోట్ల మిగులు ఉంటుందని బడ్జెట్ లో చూపారని, మొదటి త్రైమాసికానికే రూ, 10,583 కోట్ల రెవెన్యూ లోటును చూస్తోందని విమర్శించారు. మూడు నెలల్లోనే రూ. 20,266 కోట్లు అప్పుగా తీసుకున్నారని మండిపడ్డారు. ఒక్క కొత్త రహదారి వేయకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టును ప్రారంభించకుండా, విద్యార్థులకు మంచి భోజనం కూడా అందించకుండా ఈ ప్రభుత్వం రూ. 20,266 కోట్లు ఖర్చు చేసింది. ఖర్చు ఎక్కడికి పోతోంది? అలాగే ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమవుతోంది? తెలంగాణ ఆర్థిక వ్యవస్థ(Telangana Economy) ఆటో-పైలట్‌లో ఉందని పెద్ద ఎత్తున చెప్పుకున్న వారందరూ ఈ దృగ్విషయాన్ని వివరించగలరా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి వారు ఎలా ప్లాన్ చేస్తున్నారో కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు(Congressional financial experts) చెప్పగలరా? అని కేటీఆర్ ప్రశ్నించారు.