11-08-2025 12:32:04 PM
అచ్చంపేట మున్సిపల్ కార్యాలయం ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.
హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి.
అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy), ఎక్సైజ్ పర్యటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు(Minister Jupally Krishna Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. వారితోపాటు ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హాజరయ్యారు.