10 July, 2026 | 1:04 AM

ఖమేనీ అంత్యక్రియలు పూర్తి

10-07-2026 12:08 AM

టెహ్రాన్, జూలై9: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లాఅలీ ఖమేనీ అంత్యక్రియల ఘట్టం గురువారంతో పూర్తయ్యింది. ఖమేనీ స్వస్థలం, షియా లు అత్యంత పవిత్రగా భావించే మషద్‌లోని ఇమామ్ రెజా మసీదులో ఆయన ను ఖననం చేశారు. అంత్యక్రియల సందర్భంగా ఉదయం నుంచే ఆ ప్రాంతంలో భారీ ఎత్తున ప్రజలు చివరిసారిగా ఖమేనీకి వీడ్కోలు పలికేందుకు గూడిగూడా రు.

ఫొటోలు చేతబూని, ప్రదర్శనలతో ఖమేనీ సేవలను కొనియాడగా, అమెరి కా, ఇజ్రాయెల్, ట్రంప్, నెతన్యాహు చర్యలపై దుమ్మెత్తిపోశారు. చివరి వీడ్కోలు ప్రార్థనలకు సంప్రదాయవాదిగా, 12వ షియా మతగురువుగా పేరుగాంచిన 101 ఏళ్ల హోస్సేన్ నూరిహమ్దానీ నాయకత్వం వహించారు.