నేపాల్‌లో జల విలయం
టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత
- నేపాల్‌లోని భోటెకోషి, లొహాండే నదుల్లోకి ఆకస్మిక వరదలు
- దిగువ గ్రామాలన్నీ జలమయం.. కొట్టుకునిపోయి 157 మంది మృతి
- మొత్తంగా ౩84 మంది టూరిస్టులు గల్లంతు
- వీరిలో105 మంది భారతీయులు, 18 మంది విదేశీయులు
- రంగంలోకి నేపాల్ సైన్యంతోపాటు భారత ఎయిర్‌ఫోర్స్
- ఆ దేశ ప్రధాని బెలెన్ షాకు భారత ప్రధాని మోదీ కాల్
- ఎలాంటి సహాయం అందించేందుకైనా సిద్ధమని భరోసా
- భారత్ నుంచి ఖాఠ్మాండుకు ప్రత్యేక విమానాల్లో అత్యవసర సామగ్రి
* ‘ఈషా’కు చెందిన 77 మంది గల్లంతు ఈషా ఫౌండేషన్‌కు చెందిన ౭౦౦ మందికి పైగా భక్తులు టిబెట్‌లోని గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి వెళ్లగా, అకస్మాత్తుగా వరద వచ్చి వారిలో ౭౭ మంది గల్లంతయ్యారు.
* జల రక్కసి విరుచుకుపడింది. బుధవారం ఉదయం టిబెట్‌లోని గోసైన్‌కుండ్ ప్రాంతంలో సంభవించిన భూకంపం తాకిడికి పొరుగున ఉన్న నేపాల్ విలవిలలాడింది. భోటెకోషి, లొహాండే వంటి నదుల నుంచి ఆకస్మికంగా వచ్చిన భారీ వరద నేపాల్‌లోని వందలాది గ్రామాలను తుడిచిపెట్టింది. కళ్లముందే ఉప్పెన వస్తున్న వరదను చూసి ప్రజలు కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీశారు.
ఈ విలయంలో 157 మంది మరణించారు. ౩84 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. వారిలో భారతీయులు ౧౦౫ మంది. వీరంతా 1౦ టూరిస్ట్ ఏజెన్సీలు లేదా ట్రావెల్స్ ఆపరేట్ సంస్థల ద్వారా నేపాల్ పర్యటనకు వెళ్లారు. గల్లంతైన వారిలో కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన వారే ఎక్కువ.
నేపాల్ సైన్యం రంగంలోకి దిగి.. రెస్క్యూ ఆపరేషన్ కోసం 30కి పైగా హెలికాప్టర్లను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నది. భారత ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు విమానాల్లో అత్యవసర సహాయక సామగ్రిని ఖాఠ్మాండుకు చేరవేసింది. నేపాల్ వరదల నేపథ్యంలో ప్రధాని మోదీ ఫోన్‌లో నేపాల్ ప్రధాని బాలెన్ షాతో మట్లాడారు.
ఖాఠ్మాండు/ న్యూఢిల్లీ, ఆగస్టు ౨౬: నేపాల్(Nepal)లో జల ప్రళయం సంభవించింది. వరద బీభత్సం(Flood Devastation) సృష్టించింది. హిమాలయ ప్రాంతమైన టిబెట్(Tibet)లోని గోసైన్‌కుండ్ ప్రాంతంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించి మంచుచరియలు విరిగిపడ్డాయి. రిక్టర్ స్కేల్(Richter scale)పై 404 తీవ్రత వచ్చిన ఈ భూకంపం కారణంగా హిమా నదీనదాలు కరిగి నేపాల్‌లోని భోటెకోషి, లొహాండే వంటి నదుల్లోకి ఆకస్మికంగా భారీగా వరద వచ్చి చేరింది.
వరదల్లో గల్లంతై 157 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. వేలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రధాన రహదారులు(Main roads), వంతెనలు(Bridges) తీవ్రంగా దెబ్బతిన్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు కట్టుబట్టలతో బయటకు వచ్చారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. దేశవ్యాప్తంగా ఆస్తి నష్టం భారీగా సంభవించింది.
కోట్లాది రూపాయల విలువైన ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. భూకంప(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత నమోదైందని ఆ దేశ జియాలజికల్ సర్వే వెల్లడించింది. రసువా, ధాదింగ్, నువాకోట్ జిల్లాల్లో విపత్తు తీవ్రంగా కనిపిస్తున్నది. నేపాల్ పర్యాటక బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ౩84 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో భారతీయులు 105 మంది. వీరంతా 1౦ టూరిస్ట్ ఏజెన్సీలు లేదా ట్రావెల్స్ ఆపరేట్ సంస్థల ద్వారా నేపాల్ పర్యటనకు వెళ్లారు.
అలాగే, గల్లంతైన వారిలో విదేశీయులు 18 మంది. విదేశీయులంతా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూఎస్, ఇంగ్లాండ్, నెదర్లాండ్‌కు చెందిన వారు. గల్లంతైన వారిలో ౨౬ మంది స్థానిక పోలీస్ సిబ్బంది, కొందరు నేపాలీలూ ఉన్నారు. వరదల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాలకు ఆర్మీ హెలికాఫ్టర్లలో భారీగా రెస్క్యూసిబ్బందిని తరలించింది.
గల్లంతైన టూరిస్టుల వివరాలు సేకరించేందుకు అక్కడి యంత్రాంగం ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించి వివరాలు సేకరిస్తున్నది. గల్లంతైన వారిలో కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన వారే ఎక్కువ అని అంచనా వేస్తున్నది. వరద ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది.
నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం 30కి పైగా హెలికాప్టర్లను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నది. సహాయక చర్యల కోసం భారత్‌తోపాటు దక్షిణ కొరియా తమ వైమానిక, రెస్క్యూ బృందాలను నేపాల్‌కు పంపించాయి. భారత ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు విమానాల్లో అత్యవసర సహాయక సామగ్రిని ఖాఠ్మాండుకు చేరవేసింది.
నేపాల్ ప్రధానికి మోదీ భరోసా
నేపాల్ వరదల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ఫోన్‌లో ఆ దేశ ప్రధాని బాలెన్ షాతో సంభాషించారు. భారత్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకైనా సిద్ధమని భరోసానిచ్చారు. వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్త నష్టాలపై ఆరా తీశారు. విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనే రెస్క్యూ ఆపరేషన్లకు పూర్తి సహకారం ఇస్తామని హామీ ఇచ్చారు.
వరదలోల గల్లంతైన భారతీయులను కాపాడేందుకు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ముమ్మర చర్యలు తీసుకుంటున్నది. వరదల్లో ౧౦౫ మంది భారతీయులు గల్లంతైన నేపథ్యంలో భారత ప్రభుత్వం సత్వరం స్పందించింది. కుటుంబీకులు సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. అనుక్షణం అప్రమత్తంగా ఉంది.






