10 July, 2026 | 1:32 AM

‘ఆపరేషన్ సిందూర్’ ప్రతిధ్వనించింది

10-07-2026 12:00 AM
  1. మా సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది
  2. భారత్‌వైపు కన్నెత్తి చూస్తే మూల్యం తప్పదు  
  3. ఆస్ట్రేలియా వేదికగా పాక్‌కు భారత ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్
  4. 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ ప్రశంసనీయం
  5. ఆస్ట్రేలియా విధానం స్ఫూర్తిదాయకం
  6. భారత్ మైత్రిలో ఎన్‌ఆర్‌ఐలు బలమైన స్తంభాలని స్పష్టీకరణ 
  7. ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ’ కార్యక్రమానికి మోదీ హాజరు
  8. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఒప్పందం  

మెల్‌బోర్న్, జూలై 9: ‘సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ప్రపంచ వ్యాప్తంగా ధ్వనించింది. ఈ ఆపరేషన్‌తో తమ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసిపోయింది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. తమకు జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యమని, మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా గురువారం మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ’ కార్యక్రమంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై, జాతీయ భద్రత విషయంలో భారత్‌కు ఉన్న ధృడ సంకల్పాన్ని ‘ఆపరేషన్ సింధూర్’ స్పష్టం చేస్తుందన్నారు.  

16 ఏళ్ల లోపు వారికి ప్రధాన సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. పిల్లల కోసం సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని సృష్టించేందుకు ఆస్ట్రేలియా అనుసరిస్తున్న చట్టం, విధానం నుంచి భారత్ చాలా నేర్చుకుంటుందన్నారు. భారత్ అభివృద్ధిలో ప్రవాస భారతీయులు ప్రగతి సారథులుగా నిలుస్తున్నారని, భారత్ ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని  తెలిపారు.

‘మెల్‌బోర్న్‌లోని భారతీయ సమాజం మధ్య ఉండటం ఎంతో ఉత్సాహంగా ఉంది. వారి శక్తి, ఉత్సాహం సాటిలేనివి. వారు భారత్-  ఆస్ట్రేలియా స్నేహానికి కీలకమైన బలమైన స్తంభాలు’ అని  మోదీ కొనియాడారు. అస్ట్రేలియాలోని అనేక ప్రాంతాలు, మార్కెట్‌లు ‘లిటిల్ ఇండియా, మినీ ఇండియాగా ప్రసిద్ధి చెందాయని, ఇది భారతీయ సమాజం యొక్క చైతన్యాన్ని, పెరుగుతున్న ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమని పాకిస్థాన్‌ను హెచ్చరించారు.

ఇరు దేశాల మధ్య దౌత్య భాషగా క్రికెట్

క్రికెట్‌ను ప్రస్తావిస్తూ భారత్- సంబంధాలను క్రీడతో పోల్చారు ప్రధాని మోదీ. మెల్‌బోర్న్ వంటి క్రీడా నగరంలో క్రికెట్ గురించి మాట్లాడకుండా ఉండటం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. క్రికెట్ రెండు దేశాల మధ్య ఒక దౌత్య భాషగా మారిందని చెప్పారు. భారత్- భాగస్వామ్యాన్ని క్రికెట్ ఫార్మాట్లతో పోల్చిన ప్రధాని, మన సమావేశాల ఎజెండా వన్డే మ్యాచ్‌లా స్పష్టంగా ఉంటుంది. నిర్ణయాలు టీ వేగంగా ఉంటాయి.

మన భాగస్వామ్యం టెస్ట్ మ్యాచ్‌లా దీర్ఘకాలికంగా, బలంగా ఉంటుందన్నారు.   ఇరు దేశాల సంబంధాలు  మరింత బలపడుతున్నాయని మోదీ అన్నారు. 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించిన తొలి భారత ప్రధానమంత్రి తానేనని గుర్తుచేసుకున్న మోదీ, తన తాజా పర్యటనను 12 ఏళ్లలో హ్యాట్రిక్ పర్యటనగా అభివర్ణించారు.  

హౌస్‌ఫుల్ షో.. బ్లాక్‌బస్టర్

మెల్‌బోర్న్‌లో జరిగిన కార్యక్రమానికి సుమారు 30వేల మంది ప్రవాస భారతీయులు తరలివచ్చారు. ఈ భారీ జనసమూహాన్ని చూసి ప్రధాని మోదీ ఉత్సాహంగా స్పందించారు.   ‘హౌస్‌ఫుల్ షో’, ‘బ్లాక్‌బస్టర్’గా అభివర్ణించారు. సిడ్నీలో గతంలో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశాలను గుర్తుచేసుకున్న ఆయన, మెల్‌బోర్న్ ప్రజలను కలవాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. 

వారితో కలిసి ‘ఫ్లాట్ వైట్ కాఫీ’ని ఆస్వాదించాలనుకుంటున్నానని చమత్కరించగా, ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి. ప్రసంగం ప్రారంభంలో ఆ భూమి, సంప్రదాయ యజమానులను గౌరవిస్తూ, వారి పూర్వీకులు, ప్రస్తుత తరం, భవిష్యత్ తరాలకు తన గౌరవాన్ని తెలియజేశారు.  

చర్చలతో అపూర్వమైన ఫలితాలు

ప్రధాని మోదీ, ఆంథోనీ అల్బనీస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలు, ఒప్పందాలు జరిగాయి.  ద్వైపాక్షిక చర్చల ఫలితాలు అణుశక్తి, వాతావరణ చర్యలు, కీలక ఖనిజాలు వంటి రంగాలలో వ్యక్తమవుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనం, వాతావరణ చర్యలు, అణుశక్తి, కీలక ఖనిజాలు, సాంకేతికత, విద్య వంటి మరిన్ని రంగాలలో నేటి చర్చలు అపూర్వమైన ఫలితాలను ఇచ్చాయి.

రక్షణ, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన ప్రకటనను జారీ చేయడం మరో ముఖ్యాంశం. నౌకా నిర్మాణం, నౌకా మరమ్మత్తు, నిర్వహణ రంగాలలో కలిసి పనిచేయడానికి మేము జరిపిన చర్చలు కూడా అంతే గమనార్హం.. అని  ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. రక్షణ, సముద్ర భద్రత, అణుశక్తి రంగాలతో సహా 18 ఫలితాల జాబితాను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పంచుకున్నారు. 

భారత్‌పై ఆస్ట్రేలియా ప్రశంసలు

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆం థోనీ అల్బనీస్ భారత్, మోదీపై ప్రశంసలు కురిపించారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం శక్తి, ఆశావాదంతో ముందుకు సాగుతోందని ఆ యన అన్నారు. మెల్‌బోర్న్ కార్యక్రమంలో కనిపించిన ఉత్సాహం భారత్ - బంధం బలాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భారతీ య ప్రవాసుల సేవలు, కషి వల్ల ఆస్ట్రేలియా మరింత మెరుగైన దేశంగా మారిందన్నారు. అలాగే విక్టోరియా రాష్ట్ర ముఖ్యమంత్రి జసింటా అలెన్ ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ భారత్‌ను ప్రశంసించారు.  

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తిరుగులేని శక్తిగా భారత్

అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించిన ప్రధాని మోదీ, చంద్రయాన్- విజయాన్ని దేశ సామర్థ్యానికి నిదర్శనంగా అభివర్ణించారు. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర సష్టించిందని గుర్తు చేశారు. ఇప్పుడు గగన్‌యాన్ మిషన్ ద్వారా భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు దేశం సిద్ధమవుతోందని, భవిష్యత్తులో స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడించారు.

సాంకేతిక రంగంలోనూ భారత్ వేగంగా పురోగమిస్తోందన్నారు. ఇప్పటికే 6జీ టెక్నాలజీపై పరిశోధనలు కొనసాగుతున్నాయని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దేశం పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. సాంకేతికత, ఆవిష్కరణలే అభివృద్ధి చెందిన భారత్‌కు పునాది అవుతాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కతి ప్రభావం మరింత విస్తరిస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

మెల్‌బోర్న్‌లో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతీయ సినిమా ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను మరింత పెంచుతోందని పేర్కొన్నారు. ప్రవాస భారతీయుల పాత్రను ప్రశంసిస్తూ, భారతీయులు ప్రతి సమాజంలో పాలలో పంచదారలా కలిసిపోతారని మోదీ ఆసక్తికర ఉపమానం ఇచ్చారు.