10 July, 2026 | 1:47 AM

ఫైనల్లో ఖమ్మం ఏసెస్

10-07-2026 12:34 AM

హైదరాబాద్‌పై విజయం

తెలంగాణ టీ20 లీగ్

హైదరాబాద్, జూలై 9: తెలంగాణ టీ20 లీగ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫైయర్‌లో ఆ జట్టు 10 పరుగుల తేడాతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్ 34 బంతుల్లోనే 76 (4ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రెడ్డి (40), పరాస్ రాజ్ (32) రాణించారు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బౌలర్లలో అఖిల్ రాథోడ్ 2, మిగి లివారంతా ఒక్కో వికెట్ పడగొట్టారు.

తర్వాత 201 పరుగుల లక్ష్యఛేదనలో హైదారాబాద్ ఈ ఛాంపియన్స్ నిరాశ పరిచింది. ఓపెనర్ సాయివికాస్ రెడ్డి 27 బంతుల్లో 69 (7 ఫోర్లు, 4 సిక్సర్లు) తప్పిస్తే మిగిలిన వారంతా విఫల మయ్యారు. సహేంద్రు మల్లు (3/31), వేద్ రెడ్డి (2/33) రాణించారు. ఈ విజయంతో ఖమ్మం ఫైనల్లో అడుగుపెట్టగా, హైదరాబాద్ జట్టు కరీంనగర్ డైమండ్స్‌తో రెండో క్వాలిఫైయర్‌లో తలపడుతుంది. అంతకుముందు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కరీంనగర్ రంగారెడ్డి రైజర్స్‌పై గెలిచింది.