13 March, 2026 | 12:42 AM

అమెరికాలో కాల్పులు.. ఖమ్మం యువకుడు మృతి

30-11-2024 10:42 AM

ఖమ్మం,(విజయక్రాంతి): అమెరికాలోని షికాగోలో నివాసం ఉంటున్న  ఖమ్మం రమణ గుట్ట ప్రాంతానికి చెందిన యువకుడు నూకారవు సాయితేజపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సాయితేజ అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిసింది. నూకారపు సాయి తేజ ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళ్లారు. దుండగుల కాల్పుల్లో మరణించడంతో ఖమ్మంలోని ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రామన్నపేట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.