అఖిల భారత 18వ మహసభలకు జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఈనెల 27 నుంచి 30 వరకు కేరళ రాష్ట్రం కోజికోడ్ లో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ అఖిల భారత 18వ మహసభలకు ప్రతినిధిగా నల్లగొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్(District Secretary Khammampati Shankar) ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోరాటాల ఖీల్లా నల్లగొండ జిల్లా నుంచి ఎస్ఎఫ్ఐ అఖిలభారత మహాసభలకు ఐదుగురు ఎంపిక కావడం జరిగిందని అన్నారు. దేశంలో విద్యారంగంలో మొదటి స్థానంలో ఉన్న కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ అఖిలభారత 18 మహాసభలకు ఒక ప్రత్యేక నేపథ్యం వుందని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలను రూపొందించడం కోసం భవిష్యత్తు కార్యచరణ రచించడం కోసం ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయని అన్నారు.






