రైతు గోస కాదు అది... బీజేపీ గోస
కేంద్రం చెప్పిన దానికంటే అధిక ధాన్యం సేకరించాం*
బిజెపి కృత్రిమ ఆందోళన సృష్టిస్తుంది
రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది
ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్
ఖానాపూర్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ నాయకులది రైతు గోస కాదు బిజెపి గోస అని, రైతులను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకునేందుకు ఈ యాత్ర చేపట్టి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedama Bojju Patel) తీవ్రంగా విమర్శించారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యం 56 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేయాలని ఆంక్షలు పెట్టినప్పటికీ తాము ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులకు పైచిలుకు కొనుగోలు చేసి రైతులకు అండదండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఇంత చేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వాన్ని రైతుల పక్షంగా నిలదీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కృత్రిమ రాజకీయం చేస్తూ రైతులపై మొసలి కన్నీరు కారుస్తుందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో బిజెపి పార్టీకి ప్రజల్లో ఆదరణ లేనందున రైతులను అడ్డుపెట్టుకొని మార్కెట్ యార్డుల్లో కూలీలకు అబద్ధాలు చెప్పి వారు తూకానికి రాకుండా చేస్తూ వారిని రెచ్చగొడుతూ గత ప్రభుత్వాలు వారికి 2020 నుంచి కూలి పెంచకుండా వేధిస్తుండగా తాము స్పష్టంగా వారికి కూలి పెంచి ఇస్తున్నప్పటికీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు బిజెపి నాయకులు ఈ రకమైన నాటకాలు చేస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా రైతుకు తడిసిన ధాన్యంతో పాటు చివరికి గింజ వరకు కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
కళ్ళల్లోకి ఎక్కడికి వెళ్ళినా రైతులు తమను సాధరంగా ఆహ్వానించి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని, బిజెపికి పూట గడవక ఈ యాత్రను చేస్తుందని విమర్శించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పడగల భూషణ్ ,ఆత్మ కమిటీ చైర్మన్ తోటసత్యం, డీసీసీ ఉపాధ్యక్షులు, కౌన్సిలర్ రాజుర సత్యం, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జంగిలి శంకర్, పట్టణ అధ్యక్షులు గొర్రె గంగాధర్, సర్పంచ్ బొడ్డు గంగన్న, నాయకులు జన్నారం శంకర్ ,పలువురు ఉన్నారు. జిల్లా






