24 June, 2026 | 2:33 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

ఖానాపూర్ మున్సిపాలిటీ అత్యంత సుందరంగా తీర్చిదిద్దుదాం

29-04-2026 07:38 PM

ఖానాపూర్ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ అత్యంత సుందరంగా తీర్చిదిద్దుదామని ఖానాపూర్ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఖానాపూర్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం మొదటి సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ మేరకు ఖానాపూర్ పట్టణ అభివృద్ధి కోసం పలు తీర్మానాలు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ మౌనిక తెలిపారు. పట్టణంలోని పలు వార్డులలో ప్రజల దాహార్తి తీర్చడానికి బోరు మోటార్లు ఏర్పాటు, మరమ్మతులు, దాంతో పాటు పట్టణంలో వేలాదిగా పెరిగిపోయిన కోతుల బెడద తీర్చేందుకు వాటిని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టి వేరే చోటికి తరలించడానికి తీర్మానం చేసినట్లు ,దాంతోపాటు పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ వంటి అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.