8 April, 2026 | 2:15 PM

బిహార్‌లో ఖేలో ఇండియా

22-11-2024 12:00 AM

న్యూఢిల్లీ: బిహార్ వేదికగా ఖేలో ఇండి యా యూత్ గేమ్స్‌తో పాటు పారా గేమ్స్ ను నిర్వహించాలని గురువారం కేం ద్ర క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ టోర్నీ జరగనుంది. గతం లో ఖేలో ఇండియా గేమ్స్‌కు, పారా గేమ్స్‌కు కనీసం 10-15 రోజులు గ్యాప్ ఉండేది. తాజాగా రెండు గేమ్స్‌ను ఒకే కాలంలో నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.