2 July, 2026 | 11:55 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

కోడి కూయక ముందే కిక్కు

20-06-2025 12:30 AM
  1. పర్మిట్ రూమ్‌ల చాటున జోరుగా మద్యం విక్రయాలు

పర్మిట్ రూంల వద్ద మద్యం అమ్మకాలకు నో పర్మిషన్

గద్వాల టౌన్, జూన్ 19 : జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున నుంచే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కూత వేటు దూరంలో ఉన్న జిల్లా అబ్కారీ శాఖకు ఎలాంటి పట్టింపు లేదు. ఒక్కో వైన్ షాపుల వద్ద మందుబాబులు తెల్లవారుజామున నుంచే క్యూ కడుతున్నారు. జిల్లా కేంద్రంకో పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, మేలచెర్వు చౌరస్తా, జమ్మిచేడు, రాఘవేంద్ర కాలనీలో మొ త్తం జిల్లా కేంద్రంలో 8 వైన్ షాపులున్నాయి.

నిబంధనల ప్రకారం ఉదయం 10 గం టల నుంచి రాత్రి10గంటల వరకు మద్యం విక్రయాలు చేపట్టాలి. కాని మద్యం షాపుల పక్కన ఉన్న ఫర్మిట్రూంల లో తెల్లవారుజామున నుంచే ప్రారంభమవుతున్నాయి.

అంతే కాకుండా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా మద్యం విక్రయాలకు పాల్పడటం వి శేషం  బహిరంగానే మద్యం విక్రయాలు పాల్పడుతున్న మద్యం షాపు నిర్వాహకులు, ఎజ్సైజ్ అధికారులు ఎవరూ అట్టు వైపు తనిఖీలు చేసిన పాపాన పోలేదు.