2 July, 2026 | 10:47 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

నలుగురు దొంగల అరెస్ట్

20-06-2025 12:30 AM

-8 తులాల బంగారం, 250 గ్రాముల వెండి స్వాధీనం.                                 

-బైక్, మూడు సెల్ ఫోన్ లు సీజ్.

-వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ

సూర్యాపేట, జూన్ 19 (విజయక్రాంతి) : జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు కు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ గురువారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత నెలలో కోదాడ పట్టణంలో ఒంటరిగా ఉన్న మహిళ మెడలో బంగారమును చైన్ స్నాచింగ్ చేశారన్నారు. అలాగే మునగాల పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారన్నారు.

దీంతో కోదాడ, మునగాల ఇన్స్పెక్టర్ ల అధ్వర్యంలో కేసులు దర్యాప్తు చేశారన్నారు.  ఈ రెండు ఘటనలు ఖరీదైన కెటిఎమ్ బైక్ పై చేసినట్లు గుర్తించారన్నారు. దీనిని ఛేదించే క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు దొంగతనం చేసిన సొమ్మును, బంగారు, వెండి ఆభరణాలను వాటాలుగా పంచుకొని అమ్ముకొనుటకు గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఏ1 ఫణి చంద్ కోదాడ పట్టణంలోని ఏ2 నాగేంద్రబాబు ఇంటికి రాగా మొత్తం నలుగురిని కోదాడ పట్టణ పోలీసులు పట్టుకున్నారన్నారు.

వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా దొంగతనాలు ఒప్పుకున్నారన్నారు. వీరి నుండి మొత్తం 7 కేసుల్లో 11 లక్షల విలువగల 8 తులాల బంగారం, 250 గ్రాముల వెండి, ఖరీదైన కెటిఎమ్ బైకు, 60 వేల విలువగల మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిలో ఫణి చంద్, నాగేంద్రబాబులను రిమాండ్ కు తరలించామన్నారు. అదేవిధంగా మరో ఇద్దరు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్ కు తరలించామన్నారు. 

 ఏ1, ఏ2లు ఇద్దరు రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి, లోనికి ప్రవేశించి విలువైన బంగారు మరియు వెండి ఆభరణములు  దొంగిలిస్తున్నట్టు తెలిపారు. అదే విధముగా ఒంటరిగా ఉన్న మహిళలపై గల విలువైన బంగారు నగలను లాక్కొని పోతారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి దొంగతనాలు జరగకుండా జాగ్రత్త పడాలి అన్నారు.

ఈ కేసును ఛేదించటంలో చాకచక్యత ప్రదర్శించిన కోదాడ టౌన్ ఇన్స్ స్పెక్టర్  కె.శివ శంకర్, ఎస్ ఐ బోలిశెట్టి సుధీర్ కుమార్ , ఏఎస్‌ఐ హనుమాన్ , కానిస్టేబుల్ లు శ్రీనివాస్, కరుణాకర్, కృష్ణ, యల్లారెడ్డి, కొండలు, సతీష్ లను  పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించడం రివారడ్స్  ప్రకటించారు. ఈ సమావేశంలో కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి, కోదాడ పట్టణ ఇన్స్ స్పెక్టర్ శివ శంకర్ లో పాల్గొన్నారు.