13 March, 2026 | 6:54 AM

ముందుజాగ్రత్తతో మూత్రపిండాల రక్షణ

13-03-2026 12:00 AM

‘వరల్డ్ కిడ్నీ డే’ సందర్భంగా కామినేని వైద్యుల పిలుపు 

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా  గురువారం ‘ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో మూత్రపిండాల ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ.. కామినేని ఆస్పత్రిలో డయాలసిస్ ద్వారా మెరుగుపడిన వారు, కిడ్నీ ట్రా న్స్‌ప్ల్లాంటేషన్ చేసుకుని జీవిస్తున్న 30 మం దిని సదస్సుకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ‘కామినేని’ యాజమాన్యం వారు యుక్త వయస్సులోనే.. కిడ్నీ సంబంధిత స మస్యల బారిన పడి,  ధైర్యంగా ఎదుర్కొని జీవితాన్ని చక్కగా సాగిస్తున్నవారికి ‘యంగెస్ట్ ఫైటర్’, అదే విధంగా పెద్ద వయస్సులోనూ  కిడ్నీ సమస్యలు తీవ్రతరమైనా.. భయపడకుండా..ధృడ సంకల్పంతో ఎదుర్కొంటూ.. జీవితాన్ని లీడ్ చేస్తున్నవారికి ‘ఐరన్ విల్’ పే రుతో రెండు రకాల సర్టిఫికెట్లు అందజేశారు. కామినేని ఆస్పత్రి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ ఎ. సం తోష్ కుమార్ మాట్లాడుతూ.. ‘కిడ్నీ సంబంధిత వ్యాధుల లక్షణాలు కనిపిస్తే.. ముం దుగా సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

కిడ్నీ జబ్బులు, డయాలసిస్ అనగానే ఇక జీవితం అయిపోయినట్లుగా భావించొద్దు. అధునాతన చికిత్సల ద్వారా డయాలసిస్, ట్రాన్స్‌ప్ల్లాంటేషన్తో విజయవంతంగా జీవితా న్ని గడపవచ్చు’ అని సూచించారు. కామినేని ఆస్పత్రి యూరాలజీ విభాగం డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాం ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. ‘కిడ్నీలను ఆరోగ్యంగా ఉం చుకోవాలంటే మొదటి, సులభమైన మార్గం సరైన హైడ్రేషన్. అది సరిగా లేకపోతే మూ త్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి.

రోజుకు కనీసం 2, 3 లీటర్ల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి కిడ్నీలపై భారం తగ్గుతుంది. కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం తగ్గుతుంది’ అన్నారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అంజ య్య, ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, లాపరోస్కోపిక్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ వి. విష్ణువర్ధన్ రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ సాయికాంత్ కుమార్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సందీప్ పాల్గొన్నారు.