10 July, 2026 | 1:50 PM

చావగొట్టి.. పైగా కేసు పెట్టి

01-07-2024 12:05 AM

ఆగ్రా, జూన్ 30: ఉత్తరప్రదేశ్‌లో మూకదాడుల దాష్టీకాలకు అడ్డులేకుండా పోతున్నది. అధికారం యంత్రాంగం కూడా వారికే వత్తాసు పలుకుతుండటంతో బాధితులే నేరస్తులుగా మారుతున్నారు. అలీగఢ్‌లో అలాంటి ఘటనే ఒకట చోటుచేసుకొన్నది. జూన్ ౧౮న మొహమ్మద్ ఫరీద్ (35) అనే వ్యక్తిపై కొందరు దాడి చేసి తీవ్రంగా కొట్టారు.  ఈ దాడిలో ఫరీద్‌తోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. తాజాగా వీరిపై పోలీసులు దొంగతనం కేసు పెట్టడం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నది. ఓ టెక్స్‌టైల్స్ వ్యాపారి భార్య ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఫరీద్‌తోపాటు మరో ఆరుగురిపై దోపిడీ కేసు పెట్టినట్టు అలీగఢ్ డీఎస్పీ రాకేశ్ సిసోడియా ఆదివారం తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.